చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం మన కర్మ

  • హంతకుడే నిరసన తెలిపినట్లుగా ధర్మపోరాట దీక్ష

  • ప్రత్యేక హోదా రాకపోకపోవడానికి చంద్రబాబే ప్రధాన కారణం

  • దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా హోదాపై బాబు వ్యాఖ్యలు

  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

హైదరాబాద్‌: ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ధర్మపోరాటం చేస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాజ్‌భవన్‌ వద్ద జననేత మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు దీక్ష చేయడడం ఎలా ఉంటుందంటే.. ఒక వ్యక్తిని పొడిచి హంతుకుడే హత్యకు వ్యతిరేకంగా దీక్ష చేస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటం అలాంటిదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబేనని, బాబు ముఖ్యమంత్రి కావడం మన కర్మ అన్నారు. సాక్షాత్తు అసెంబ్లీలో ప్రత్యేక హోదాను నీరుగారుస్తూ చంద్రబాబు మాట్లాడిన మాటలు ఎవరూ మర్చిపోలేదని, ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రం ఏం బాగుపడ్డాయని,  హోదా సంజీవనా..? అని మాట్లాడిన మాటలు ప్రజలు మర్చిపోలేదన్నారు. ప్యాకేజీ ప్రకటన చేసినప్పుడు అరుణ్‌జైట్లీ పక్కనే చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులు కూర్చున్నారన్నారు. అసెంబ్లీలో అరుణ్‌జైట్లీని, బీజేపీ ప్రభుత్వాన్ని పొగుడుతూ ధన్యవాద తీర్మానం చేసింది మర్చిపోలేదన్నారు.

2017 జనవరి 27వ తేదీన ప్రెస్‌మీట్‌ పెట్టి ఆంధ్రరాష్ట్రానికి బీజేపీ చేసినట్లు ఏ రాష్ట్రానికైనా ఎక్కడైనా మేలు జరిగిందా..? చాలెంజ్‌ విసురుతున్నా చెప్పండి అని బీజేపీ ప్రభుత్వాన్ని ఏ విధంగా చంద్రబాబు భుజాన మోశారో ప్రజలంతా చూశారన్నారు. నాలుగు సంవత్సరాలు బీజేపీతో సంసారం చేసినప్పుడు హోదాను ఖూనీ చేశారని, బీజేపీతో చంద్రబాబు సంసారం చేసినప్పుడు చంద్రబాబు మనుషులు ఇద్దరు కేంద్రమంత్రులుగా పనిచేశారన్నారు. నాలుగున్నరేళ్లు హోదా ప్రస్తావన తీసుకురాని వ్యక్తి ప్రజల్లో హోదా నినాదం బలంగా నాటుకుపోయిందని యూటర్న్‌ తీసుకొని నల్లచొక్కా వేసుకొని పోరాటం చేస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.

Related Post

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


www.000webhost.com