వైయస్‌ జగన్‌తోనే ఏపీకి మంచిరోజులు…

రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీలోకి భారీ చేరికలు..

రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీలోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన నేతలు,కార్యకర్తలు పార్టీలోకి  చేరుతున్నారు.  వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలోనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. వైయస్‌ జగన్‌ రూపొందించిన నవరత్నాలతో మంచిరోజులు రాబోతున్నాయని ప్రజలు భావిస్తున్నారు.

అనంతపురం: అనంతపురం అర్బన్‌ సమన్వయకర్త అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో విపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో టీడీపీకి చెందిన పలువురు నాయకులు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.వారికి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.పార్టీలోకి చేరినవారిలో టీడీపీ మైనారీటి సెల్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు నజీర్‌ తదితరులు ఉన్నారు.

చిత్తూరు జిల్లాలో:

తిరుపతి రూరల్‌ చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నుంచి వైయస్‌ఆర్‌సీపీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. యువ నాయకుడు బీగాల చంద్రమౌళి,పార్టీ మండల నాయకుడు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వేదాంతపురం పంచాయతీ ఓటేరుకు చెందిన టీడీపీ నాయకులు,50 మందికిపైగా కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.వారికి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

తూర్పుగోదావరిలో:

కొత్తపేట గణేష్‌ నగర్‌లో టీడీపీకి చెందిన సుమారు 50 కుటుంబాలు ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. చింతూరు మండలం కొల్తూరులో సీపీఎంకు చెందిన 45 కుటుంబాలు,చదలవాడలో 70 కుటుంబాలు,చౌలూరులో 20 కుటుంబాలు,గవళ్లకోటలో బీజేపీకి చెందిన 50 కుటుంబాల వారు పార్టీలోకి చేరారు.వైయస్‌ఆర్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, రంపచోడవరం నియోజకవర్గం కోఆర్డినేటర్‌ నాగులపల్లి ధనలక్ష్మి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.కాకినాడ రూరల్‌ మండలం వేళంగి గ్రామానికి చెందిన పలువురు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. కాకినాడలోని పార్టీ కార్యాలయంలో వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురుసాల కన్నబాబు పార్టీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చింతూరు మండలం పెద శీతనపల్లి పంచాయతీ  కొల్తూరుకు చెందిన మాజీ సర్పంచి పులి ముత్తమ్మ వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.ఆమెను యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్,రంపచోడవరం  కోఆర్డినేటర్‌ నాగులపల్లి ధనలక్ష్మి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

కర్నూలు జిల్లాలో:

కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య సమక్షంలో రిటైర్డ్‌ ఇంటలిజెన్స్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్,నాయీ బ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు వేముగడ్డ వెంకటరమణ మూర్తి వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. ఆయనకు బీవై రామయ్య పార్టీ కండువా  కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.కర్నూలు నగరంలోని 51వ వార్డుకు చెందిన  50 కుటుంబాలు  వైయస్‌ఆర్‌సీపీలోకి చేరాయి.వైయస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ ఖాన్‌ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Related Post

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


www.000webhost.com