
బాబుగారి కథలు తెలియని దెవరికి లేబ్బా?!
రైల్లో ఎక్కాను. యర్రగుంట్ల నుంచి కాచిగూడ కేసి ప్రయాణం. ఆ ఎ.పి. సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో, అప్పటికే నేనెక్కిన కంపార్ట్మెంట్లో పదిమందికి పైగా వున్నారు. ఎంత దూరప్రయాణమైనా, సాధ్యమైనంతవరకు పగలు ప్రయాణం చేయాలన్న తపన నాది. అంతంత దూరాలు..రాత్రి ఎక్కితే సరిపోదూ…పడుకుని తెల్లారి హాయిగా దిగేయొచ్చు…భలే తిక్కప్పా నీకు అనే [..]