రాబోయే ఎన్నిక‌ల్లో 150 సీట్లు ఖాయం

వైయ‌స్ఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి

అమరావతి : రాబోయే ఎన్నికల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ 150 సీట్లు సంపాదిస్తామని  వైయ‌స్ఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి​ ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే వైయ‌స్ఆర్‌ సీపీ ఎన్నికలకు సిద్దమవుతోందని.. తమది అతి విశ్వాసం కాదని.. ఆత్మ విశ్వాసమని ఆయ‌న పేర్క‌న్నారు.

రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీని వ్యవస్థాగతంగా బలోపేతం చేసుకునేందుకు గ్రామస్థాయి నుంచి ప్రతి ఒక్కరినీ సమాయత్తం చేస్తున్నామన్నారు. వారందరికీ వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిశానిర్దేశం చేసి కార్యోన్ముఖులుగా చేస్తారని పేర్కొన్నారు. అన్ని రకాల ఎత్తుగడలు, చేయరాని పనులన్నీ చేసి చంద్రబాబు గద్దెను ఎక్కారని, ఇప్పటికీ ఆయనలో మార్పు లేదని విమర్శించారు. కొత్తగా ఏర్పడినా.. మూడు నాలుగు దశాబ్దాల వరకు నిలబడేలా పార్టీని వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి బలోపేతం చేస్తున్నారని తెలిపారు. .

Related Post

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


www.000webhost.com