వైయస్ఆర్సీపీ నేత తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి…
అనంతపురం: అధికార కార్యక్రమాల్లో రౌడీషీటర్లకు ప్రాధాన్యత ఇస్తున్న పరిటాల సునీత తీరును వైయస్ఆర్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తప్పుబట్టారు. మంత్రిగా ఉంటూ రౌడీలు,గూండాలను పెంచిపోషించటం తగదన్నారు. పోలీసులు పరిటాల కుటుంబానికి తొత్తులుగా పనిచేయడం బాధాకరం అన్నారు.పరిటాల శ్రీరాం,సోదరులు మురళీ,బాలాజీలపై పలు హత్యకేసుల్లో ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. మంత్రి పరిటాల సునీత వర్గీయుల ఆగడాలను ఎస్పీ అశోక్‌కుమార్ ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు.
Be the first to comment