- వైయస్ఆర్సీపీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ
విజయవాడ : రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని వైయస్ఆర్సీపీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ విజయవాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు అడపా శేషు విమర్శించారు. తమకు న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ బాధితులు అనేక ధర్నాలు చేస్తుంటే చంద్రబాబుకు కనపడడం లేదా అని ప్రశ్నించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన కఠారు శ్రీనివాసరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
ఇప్పటివరకు 260మంది అగ్రిగోల్డ్ బాధితులు చనిపోయారని, వారి మరణాలకు టీడీపీ మూల్యం చెలించక తప్పదని హెచ్చరించారు. ఈ నెల 30న వైయస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు, ఇబ్బందులపై అత్యవసర సమావేశం ఏర్పాటుచేశామని, అగ్రిగోల్డ్ బాధితులు తరఫున ఒకటో తేదీనుంచి వైయస్ఆర్సీపీ పోరాటం ఉధృతం చేస్తోందని అడపా శేషు వెల్లడించారు.
Be the first to comment