- పట్టించుకునే నాథుడే లేడు
- శ్రీకాళహస్తి వాసుల మోర
- పరిష్కరిస్తామని పవిత్ర రెడ్డి హామీ
వార్డుల్లో నిత్యం సమస్యలతో సతమవుతున్నా తమను పట్టించుకొనే నాథుడే కరువయ్యారని శ్రీకాళహస్తి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.తమ సమస్యలు పరిష్కరించాలని బియ్యపు పవిత్ర రెడ్డి గారి ఎదుట వాపోయారు. రావాలి జగన్ – కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా ఆమె సోమవారం శ్రీకాళహస్తి పట్టణంలోని 31,30 వార్డుల పర్యటనలో బాగంగా గడపగడపకు తిరిగి నవరత్నాల ప్రయోజనాలను స్థానికులకు వివరించారు.
సమస్యలు చాంతాడంత
వేసవి కాలం వస్తే తాగునీటి సమస్య, దొంగల భయం ఇలా చెప్పుకుంటూ పొతే తమ సమస్యలు చాంతాడంత ఉన్నాయని స్థానికులు పవిత్ర రెడ్డికి మొరపెట్టుకున్నారు. ఎన్నికల సమయం వస్తేనే సమస్యలు చెప్పండి అంటూ పరిగెత్తుకుంటూ కాలనిలకు వస్తారని తర్వాత మమ్మల్ని మరిచిపోవడం పరిపాటిగా మారిందని వాపోయారు. కాలం మారుతున్న తమ తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరుగు కాలవలు నిర్మాణాలు అద్వానంగా చేపట్టడంతో మరుగు నిరు ముందుకు కదలక దోమల బారిన పడి ప్రతి ఇంటిలో ఒకరు ఇద్దురు చొప్పున జ్వర పిడితులు ఉన్నారన్నారు . ఇంటి పన్నులు ఇష్టానుసారంగా పెంచి తమ నడ్డి విరిచారని విచారం వ్యక్తం చేశారు. పందుల సంచారాన్నిఅరికట్టాలని కోరారు, ఈ సమస్యపై పాలకులకు అధికారులకు మొరపెట్టుకొన్న స్పందించటం లేదని వాపోయారు. ఇళ్ళ స్థలాలు లేని నిరుపేదలుఎంతోమంది ఉన్నారని వారికి స్థలాలు కేటాయించి పక్కాగృహాలు నిర్మించాలని కోరారు.పెన్షన్లు మంజూరయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేసారు.
చివరగా పవిత్ర రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు నవరత్నాలు వర్తింపజేస్తామన్నారు. మీ ఎదురుచూపులు త్వరలోనే పలిస్తాయి, అన్న వస్తున్నాడు మన కలలను సాకారం చేస్తాడు. ఈ సమస్యల ఉచ్చులోనుంచి బయటపడాలంటే ప్యాన్ గుర్తుకి ఓటు వెయ్యాలని మనవి చేసారు కాలని సమస్యలను మున్సిపాల్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Be the first to comment