అక్కా చెల్లెమ్మ‌లూ..ఒక్క‌సారి ఆలోచించండి!

ప‌సుపు కుంకుమ‌..ప‌చ్చ మోసం

సున్నా వ‌డ్డీల‌కు ఎగ‌నామం పెట్టిన చంద్ర‌బాబు

ఐదేళ్ల పాటు డ్వాక్రా మ‌హిళ‌ల నుంచి వ‌డ్డీలు వ‌సూలు

ఎన్నిక‌ల‌కు రెండు నెల‌ల ముందు రూ.10 వేలు అంటూ డ్రామాలు

చంద్ర‌బాబు మోసాల‌పై మ‌హిళా లోకం ఆగ్ర‌హం

అమరావ‌తి:  ‘అన్నగా మీకు నేనున్నాను.. అప్పు చేసైనా అక్కచెల్లెళ్లకు అండగా నిలబడతాను. కొండనైనా బద్దలు చేసే శక్తి నా ఆడబిడ్డలు నాకు ఇచ్చారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న‌టి స‌భ‌లో భారీ సినిమా డైలాగ్ కొట్టారు. మ‌రీ ఈ ఐదేళ్ల పాటు ఈ అన్న ఎక్క‌డ దాక్కున్నాడ‌ని మ‌హిళ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో డ్వాక్రా రుణాలు మాఫి చేస్తాన‌ని హామీ ఇచ్చిన చంద్ర‌బాబు ఒక్క రూపాయి కూడా మాఫి చేయ‌క‌పోగా, ఎన్నిక‌ల‌కు రెండు నెల‌ల ముందు ప‌సుపు కుంకుమ అంటూ ఒక్కొ మ‌హిళ‌కు రూ.10 వేలు, స్మార్ట్ ఫోన్ ఇస్తామ‌ని తాయిళాలు ప్ర‌క‌టించారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో డ్వాక్రా సంఘాల‌కు సున్నా వ‌డ్డీల‌కే బ్యాంకు రుణాలు ఇప్పించారు. చంద్ర‌బాబు వ‌చ్చాక ఈ రుణాలు అంద‌క‌పోగా, మ‌హిళ‌ల‌కు బ్యాంకుల నుంచి నోటీసులు అంద‌జేశారు. డ్వాక్రా స‌భ్యులు ఈ నాలుగేళ్ల‌లో బ్యాంకు గ‌డ‌ప తొక్కేందుకు భ‌య‌ప‌డ్డారు. అలాంటి చంద్ర‌బాబు ఇప్పుడేదో ఉద్ద‌రిస్తాన‌ని ఆడ‌బిడ్డ‌ల‌ను మ‌రోమారు మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

అక్క చెల్లెమ్మ‌లూ..ఒక్క‌సారి ఆలోచించండి. సున్నా వడ్డీ తో పొందే డ్వాక్రా రుణాలకు ఇన్నాళ్లు 14 శాతం వడ్డీ చెల్లించారు. ఈ నాలుగేళ్లు అంటే 48 నెలలకు దాదాపు లక్ష రుణం తీసుకున్న ప్రతి ఆడపడుచు సుమారు అదనంగా 30 వేలు రూపాయలు బ్యాంకులు చెల్లించారు. కారణం గత ప్రభుత్వాలు ఆడ పడుచులకు డ్వాక్రా రుణాలను సున్నావడ్డీలకు ఇచ్చేవి. రూ. 1 లక్ష రుణం తీసుకుంటే లక్ష మాత్రమే చెల్లించే వారు. ఒకే వేల అదనంగా చెల్లంచి వుంటే ప్రభుత్వ బ్యాంకులకు జమ చేసిన తక్షణం వారి అకౌంట్లో  వడ్డీ తిరిగి జమ అయ్యోది.

చంద్రబాబు నాయుడు పూర్తిగా డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామన్న గత ఎన్నికల్ల ఇచ్చిన హామీని మరిచి , నేడు ఆయన ఇస్తానని చెప్పిన రూ.10 వేలకు మ‌హిళ‌లు మురిసిపోతున్నార‌ని అనుకూల మీడియాతో ఊద‌ర‌గొడుతున్నారు. అయితే ఇన్నాళ్లు   రూ.30 వేలు కోల్పోయామ‌న్న సంగ‌తి చాలా మందికి తెలియ‌దు.  మహిళలను ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు అధికారులు బాసటగా నిలిచి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆడ పడుచులను వంచించుట కు ప్రణాళికలు రూపొందించి వేదికలు సిద్ధం చేశారు . వైయస్ఆర్‌ కడప, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాలలో. వాస్తవంగా ఈ ప్రభుత్వంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఆశా వర్కర్లు పొదుపు సంఘాల మహిళలు ఎన్నో అవమానాలకు గురైన విషయం మనందరికీ తెలిసిందే!

నేడు ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలను చంద్రబాబు చెబితే నమ్మరని సంబంధిత శాఖ అధికారులు చేత చెప్పించి, నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వ పదవీ కాలం ఒకటిన్నర నెలలో ముగియ‌నుంది.  చంద్రబాబు నాయుడు ఉద్యోగ సంఘాల నాయకులను ప్రలోభ పరచుకొని వారికి తాయిలాలు ఇచ్చుకుంటూ, ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం లో విజయం సాధించారు. నేడు వాళ్ళ మనసులో ఇష్టం లేకున్నా క్రింది స్థాయి అధికారుల చేత ఇది సమర్థవంతమైన ప్రభుత్వం అనిపిస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ అధినేత ఆలోచ‌న విధానాన్ని పార్టీ శ్రేణులు అర్థం చేసుకొని చంద్ర‌బాబు మోసాల‌పై ప్ర‌చారం చేయాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది.

ఉదాహ‌ర‌ణ‌కు..
గ్రూప్ సభ్యులు 10 మంది
తీసుకున్న రుణం రూ.6 లక్షలు
రుణం తీసుకున్న తేదీ 10-12-2015
మొత్తం కంతులు : 36 నెలలు
చివర కంతు తేదీ : 17-12-2018
36 నెలల్లో గ్రూప్ సభ్యులు చెల్లించింది :731464 రూపాయలు
36 నెలలకు వడ్డీ 131464 రూపాయలు
గత ప్రభుత్వాల పద్దతి చంద్రబాబు అనుసరించి వుంటే ఒక్కో సభ్యురాలు దాదాపు 13000 లబ్ధి పొందివుండేవారు
ఈ రూ.13వేలు కోల్పోయారని ఎంత మందికి తెలుసు..?

 

అక్కచెల్లెమ్మలకు అండగా వైయ‌స్‌ జగన్‌
♦ 2019లో అసెంబ్లీ ఎన్నికల నాటికి డ్వాక్రాఅక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా నేరుగా వారి చేతికే ఇస్తాం.
♦ మళ్లీ సున్నా వడ్డీకే రుణాల విప్లవం తెస్తాం. ఆ వడ్డీ డబ్బును అక్కచెల్లెమ్మల తరఫున మేమే బ్యాంకులకు కడతాం. ‘వైఎస్సార్‌ ఆసరా’ పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తాం.
♦ 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలకు పెన్షన్‌ ఇస్తామంటే కొందరు వెటకారం చేశారు. అందులో
ఉన్న స్ఫూర్తిని అర్థం చేసుకోలేకపోయారు. అయినా వారి సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని ‘వైఎస్సార్‌ చేయూత’ పథకాన్ని తీసుకొస్తున్నాం.
♦ వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా 45 ఏళ్లు నిండినఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని అక్కలందరికీ తోడుగా ఉంటాం.
♦ ప్రస్తుత కార్పొరేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అందరికీ మేలు జరిగేలా,
♦ కొందరికో అరకొరగా ఇస్తూ.. అది కూడా లంచం లేనిదే ఇవ్వనిపరిస్థితులను మారుస్తూ పారదర్శక ప్రమాణాలను తీసుకొస్తాం.
♦ 45 ఏళ్లు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కలకు ఈ పథకం ద్వారా రూ.75,000 ఉచితంగా ఇస్తాం. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన రెండవ ఏడాది నుంచి వరుసగా నాలుగేళ్లలో నాలుగు విడతలుగా ఈ మొత్తాన్నిఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా అందజేస్తాం.   – వైయ‌స్‌ జగన్‌

Related Post

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


www.000webhost.com