పార్టీ కోసం కష్టపడ్డవారిని భుజాలకెత్తి మోస్తాం

కార్యకర్తలే వైఎస్సార్సీపీ కి దేవుళ్ళు

బాలాయపల్లిలో మాజీ మంత్రి ,వైఎస్సార్సీపీ వెంకటగిరినియోజకవర్గ సమన్వయకర్త అనరామనారాయణరెడ్డి నిర్వహించిన విజయభేరీ సభకు అనూహ్య స్పందన లభించింది .వైఎస్సార్సీపీ అగ్రనేతలకు కార్యకర్తలు అభిమానులు బ్రహ్మరధం పట్టారు .సమరోస్థాహంతో ర్యాలీలో కదం తొక్కారు .అభిమాన జల్లులతో నేతలను ఉక్కిరిబిక్కిరి చేసారు .అనంతరం జరిగిన సభలో వైఎస్సార్సీపీ జిల్లాపార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గాన్ని మంచిరోజులు రాబోతున్నాయన్నారు .దివంగతనేత వైఎస్ హయాంలో అయన ఆశీస్సులతో తెలుగుగంగ ఎడమకాలువ పనులకు శ్రీకారం చుట్టి పంటలకు నీరందించిన ఘనత ఆనం రామనారాయణరెడ్డిదే అన్నారు .సమర్ధవొంతమైన నాయకత్వపటిమ సోదరసమానులైన అనంలో పుష్కలంగా ఉందన్నారు .అధికారపార్టీ ఆగడాలకు ,నియంతృత్వానికి పులుస్టాప్ పెట్టి ఇప్పటివరకు చూడని అభివృద్ధిని నియోజకవర్గంలో చేసి చూపే సత్తా ఆనం రామనారాయణరెడ్డికే ఉందన్నారు .ఆనం సంరక్షణలో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ,అధికారపార్టీ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్ఛారు. వెంకటగిరినియోజకవర్గంలో ఆనంకు అనూహ్య మెజారిటీ రావటం ఖాయం , 2019 ఎన్నికల్లో ఆనం రామనారాయణరెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి బాటలువేయాలన్నారు . అధికారపార్టీ ఆగడాలకు చెక్ పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని  కష్టకాలంలో ఇబ్బందులను సైతం ఎదుర్కొని పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తలను బుజాలకెత్తిమోసేందుకు తమనేత జగన్ మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు .గిరివాసుల కష్టాలు కడతేర్చేందుకే సమర్దవొంతమైన ఆనం రామనారాయణరెడ్డిని వైఎస్సార్సీపీ అభ్యర్థిగా అధినేత బరిలో దింపారని .జగన్ మోహన్ రెడ్డికి పట్టంకట్టి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు .

అనంతరం సభలో ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసారు .తిరుమలలో వేయికళ్ళమంటపం కూల్చి అలిపిరి దుర్ఘటన ఎదుర్కొన్నా చంద్రబాబులో మార్పురాలేదని విమర్శించారు .కుటుంబసభ్యుల పూజాఫలితంతో వెంకన్న స్వామి క్షమించినా బుద్దిరాలేదని ఆరోపించారు .తిరుపతి పెరుమారుస్తానని బాబు చెప్పటం పచ్చచొక్కాల తమ్ముళ్లు చప్పట్లు కొట్టటం సిగ్గుచేటన్నారు .జన్మభూమిని సిలికాసిటీగా మారుస్తానని ప్రకటించడంపై ఛలోక్తులు విసిరారు . జన్మభూమికే ద్రోహం తలపెట్టే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్రప్రజల దౌర్భాగ్యమన్నారు .రాష్ట్రంలో పాలన గాడితప్పిందని దాన్ని సరిచేయగల సత్తా రాజన్న తనయుడు జగన్ మోహన్ రెడ్డికే ఉందన్నారు .విద్య,వైద్యం ,సంక్షేమం అందరికీ అందాలన్నా ,దివంగతనేత వైఎస్సార్ తరహా ప్రజారంజక పాలన తిరిగి రావాలన్నా 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్రపగ్గాలు అప్పచెప్పాలని పిలుపునిచ్చారు . ఆంధ్రద్రప్రదేశ్ లో సుపరిపాలన ,స్వపరిపాలనా రావాలంటే జగన్ మోహన్ రెడ్డి తోనే సాధ్యమన్నారు .

అధికారపార్టీ నేతల్లాగా లోపాయికారీ వ్యవహారం ,దోపిడీ నాకు చేతకావు ప్రాతినిధ్యం వహించే ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్దితో పనిచేస్తా 2019 లో జగన్ మోహన్ రెడ్డికి పట్టం కట్టి బాబుకు బుద్ధిచెప్పండి

 

———–

ఆదరిస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తా -ఆనం

———–

వెంకటగిరి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఎటువంటి అభివృద్ధికార్యక్రమాలు చేపట్టాలన్న దానిపై ఇప్పటికే సర్వే కూడా పూర్తి చేయించామని ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు .ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే అధినేత జగన్ మోహన్ రెడ్డి అండతో నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధిని ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తానన్నారు .అధికారపార్టీ నేతల్లాగా లోపాయకారి వ్యవహారాలు ,దోపిడీలు తనకు చేతకాదన్నారు .అధిష్టానం ఏ ప్రాంతానికి పంపితే అక్కడనుంచి పోటీచేయటం ప్రాతినిధ్యం వహించిన నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయటం తమపెద్దలనుంచి అలవడిన లక్షణమన్నారు .ప్రాంతీయత ముసుగులో పదవులు పొంది సొంత వ్యాపారాలు ,దందాలు పొంది ఆదరించిన జనాన్ని మోసం చేసే నైజం తమది కాదన్నారు .ఆశీర్వదిస్తే ఇప్పటివరకు చూడని అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపించి అసలైన నాయకుడంటే ఎలావుంటాడో చూపిస్తానన్నారు  . చాటుకొన్నారునెల్లూరు జిల్లా.. పేరు ఇప్పుడు సిలికా జిల్లాగా TDP ఎమ్మెల్యేలు మార్చేసారు.35 సంవత్సరాల నా రాజకీయ  జీవితంలో సిలికా అంటే తెలియదు..గెలిచి 4 సంత్సరాలు కూడా కానీ ఎమ్మెల్యేలు, ఒక MLC జిల్లాను బ్రష్టు పట్టించారు. జిల్లాకు సిలకా మరక అంటిచారు. సిలికా, ఎర్రచందనం ఉంటే ఓటుకి 5 వేలు అయినా ఇస్తారు…?

 

వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లి లో వైఎస్సార్సీపీ విజయభేరి విజయవొంతంగా ముగిసింది .నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టి తొలిసారి పార్టీ కార్యక్రమం నిర్వహించిన మాజీ మంత్రి ఆనంకు బాలాయపల్లి వాసులు బ్రహ్మరధం పట్టారు .మండలం నలుమూలలనుంచి అధికసంఖ్యలో తరలివొచ్చిన కార్యకర్తలు ,వైఎస్ అభిమానులు ఆనంను అభినందనమందార మాలలతో ముంచెత్తారు .జగనన్నా జయహో ,ఆనం జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెతించారు .అడుగడుగు నీరాజనాలతో సాదర స్వాగతం పలికారు .వైఎస్సార్సీపీ జెండాలను రెపరెపలాడించి జగన్ పై తమకున్న అభిమానాన్ని చాటుకొన్నారు

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి అగ్ర నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ వరప్రసాద్ రావు గారు, సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య గారు, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు,కలిమిలి రాంప్రసాద్ రెడ్డి గారు,  కొడవలూరు ధనుంజయ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు

Related Post

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


www.000webhost.com