వైయస్‌ జగన్‌ను సీఎం చేసుకుంటాం..

ప్రత్యేక కార్పొరేషన్‌ హామీపై రెల్లి కులస్తులు హర్షం…
శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను రెల్లి కులస్తులు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.తమకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుచేయాలని వినతిపత్రం ఇచ్చారు.చంద్రబాబు తమను ఓటు బ్యాంకులా వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.నాలుగున్నరేళ్లుగా అభివృద్ధి చెందలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలోనూ 10లక్షల వరుకు రెల్లి కులస్తులు ఉన్నారని, టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒకటి కూడా నెరవేర్చలేదన్నారు. ఎస్సీకార్పొరేషన్‌లో కూడా రెల్లి కులస్తులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.లోన్లు, స్వయం ఉపాధి ,విద్యాపరంగా ఎటువంటి లబ్ధి చేకూరడంలేదన్నారు.చంద్రబాబును రెల్లి కులస్తులు తరపున నాలుగుసారు కలిశామని కనీసం పట్టించుకోని పాపాన పోలేదన్నారు.అధికారంలోకి రాగానే తప్పకుండా న్యాయం చేస్తానని వైయస్‌ జగన్‌ భరోసా ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా రెల్లి కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుపై కూడా హామీ ఇవ్వడంం పట్ల హర్షం వ్యక్తం చేశారు.వైయస్‌ జగన్‌ పట్ల మాట తప్పని,మడమ తిప్పని నేతగా సంపూర్ణ విశ్వాసం ఉందని, ఆయనను ఖచ్చితంగా సీఎం చేసుకుంటామన్నారు.రాష్ట్రంలో రెల్లి కులస్తులందరూ ఏకతాటిగా నిలబడి వైయస్‌ఆర్‌సీపీ గెలుపునకు కృషిచేస్తామని తెలిపారు.

Related Post

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


www.000webhost.com