విజయనగరం: రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 298వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం పార్వతీపురం నియోజకర్గంలోని చిన్నరాయుడుపేట నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి నిడగల్లు క్రాస్, మరిపివలస మీదుగా సూరమ్మ పేట వరకు పాదయాత్ర కొనసాగనుంది.
వైయస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి రానున్నాడనీ.. తమ జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయనతో తమ గోడు చెప్పుకుని గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని జనం ఆరాట పడుతున్నారు. జననేత తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు.
Be the first to comment