లెజెండ్

అవును. ఖచ్చితంగా. జగన్ ను లెజెండ్ అని అభిమానులు పిలుచుకోవడంలో ఆశ్చర్యం లేదు. అతడి వ్యక్తిత్వం, నడత, స్వచ్ఛత ఆయన్ను లెజెండ్ గా నిలబెట్టాయి. 
బీద, గొప్ప తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఆదరించడమనే లక్షణం తండ్రినించి పుణికిపుచ్చుకున్నాడు వైఎస్ జగన్. తండ్రిలాంటి హావభావాలు ప్రదర్శిస్తున్నాడని ఎద్దేవా చేసినవారికి, తండ్రంతటి గుణవంతుడని ప్రజల మన్ననలందుకుని చూపించాడు. ఆహార్యంలో కాదు వ్యవహార్యంలో తన వారసత్వాన్ని నిరూపించుకున్నాడు. ఆప్యాయంగా పలకరించే తీరులో, ఆదరంతో మాట్లాడే మాటలో వైఎస్ జగన్ లో మహానేతను చూస్తున్నామని చెప్పే వారెందరో….
చిరునవ్వు ఆభరణం అంటారు. కానీ కష్టంలోనూ ఆ నవ్వును వీడనివాళ్లనేమనాలి? విమర్శలను, అభాండాలనూ చివరకూ భౌతిక దాడులను కూడా సహనంతో భరించి, చిరునవ్వుతోనే శత్రువును జయిస్తున్న ఈ వీరుడిని లెజెండ్ అనడంలో తప్పేముంటుంది.
అహంకారి అని, పెద్దలను లెక్కచేయడని, దురుసుగా మాట్లాడతాడని పనిగట్టుకు ప్రచారం చేసారు. కానీ అతడి వినయం గురించి ప్రజలు మాట్లాడుతున్నారు. అతడి విధేయత గురించి రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. పెద్దలను గౌరవించే తీరు, పిన్నలతో అభిమానంగా మెలిగే తీరు జగన్ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. ఎంతటి బాధలోనూ, వత్తిడిలోనూ జగన్ పరుషంగా ఒక్కమాట అన్న చరిత్ర వెతికి చూసినా దొరకదు. అసహనంగా ప్రవర్తించిన ఒక్క తీరూ వెయ్యికళ్లతో చూసినా దొరకదు. సొంత అభిమానులనే చాచిలెంపకాయ కొట్టేవాళ్లు, కార్యకర్తలనే కసురుకునేవాళ్లు, అయ్యా అంటూ వస్తే ఈసడించుకునే నాయకులు మనకు తెలుసు. కానీ తనవాళ్లనుకున్న వాళ్లు దగ్గరకువస్తే ఆత్మీయత చూపడం, ఆత్మీయులమని అంటే వారికి చేరువగా వెళ్లడం జగన్ కే సాధ్యమైంది.
తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక కన్నీరు పెడుతూనే, ఇంత పెద్ద కుటుంబాన్ని నాన్న నాకు అందించాడని తనని తాను దిటవు చేసుకున్న నిబ్బరం ఉన్న మనిషి జగన్. ఆ కుటుంబానికి తానే పెద్దదిక్కునని భావించి ప్రతి గడపనూ పలకరించిన మంచి మనసున్న మనిషి.
డాబు దర్పం అతడిలో మచ్చుకైనా కనిపించవు. జగన్ మాత్రమే కాదు ఆ కుటుంబంలో ఎవ్వరూ అలాంటి ఆడంబరాలతో కనిపించరు. బాబోయ్ పెద్దోళ్లని పక్కకి తప్పుకునేలాంటి ప్రవర్తన ఆ కుటుంబంలోని ఎవ్వరి దగ్గరా ఉండదు. అన్నా అంటూ చనువుగా చేయిపట్టుకుని కష్టం చెప్పుకునే దగ్గరితనం ఆ కుటుంబం దగ్గరే దొరుకుతుంది. ఆ దగ్గరితనమే వారిని జగన్ ను వారికి దగ్గర చేసింది. అతడి స్వేదాన్ని తుడిచినా, నోటికి ముద్ద అందించినా, నీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ హెచ్చరికలు చేసినా ప్రజలకు దగ్గరైన ఆ బంధమే కారణం.
తండ్రి తర్వాత ముఖ్యమంత్రి పీఠానికి తాను వారసుడినని జగన్ ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఆ పదవి మీద ఇష్టం ఉంది. ఆ పదవిలో ఉండే ప్రజలకు మంచి చేసి పదికాలాలు గుర్తుండిపోవాలని ఉంది. నేను మరణించాక నాన్న ఫొటో పక్కనే నా ఫొటో పెట్టుకునేలా పరిపాలన చేయాలని ఉంది అంటారు వైఎస్ జగన్. ఇది ఎంత గొప్ప లక్ష్యం. పదవీ వ్యామోహం కదా ప్రజాసంక్షేమం అతడి ధ్యేయం. అలాంటి అపురూపమైన వ్యక్తి కనుకే ప్రజలు జగన్ పై అంతటి అభిమానం కురిపిస్తున్నారు. తమ నాయకుడితడే అని ప్రకటిస్తున్నారు.

Related Post

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


www.000webhost.com