చిన్నారుల ముద్దుల మావయ్య

వైఎస్ జగన్ ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచలనం. వైఎస్ జగన్ అతడి మాట, అతడి మౌనం, అతడి పోరాటం, అతడి సాహసం, అతడి ఓర్పు, నేర్పూ అన్నీ యువతను ఆకర్షిస్తున్న అంశాలు. వైఎస్ జగన్ ఆ చిరునవ్వు, ఆ పలకరింపు ఎందరికో బాసట. పసి వారి నుంచి పండు ముసలిదాకా అతడి మాటలే ఊరట.
వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర ఆరంభమైన రోజు నుంచీ ప్రతి చోటా చిన్నారుల ఆత్మీయత ఆయన్ను చుట్టు ముడుతూనే ఉంది. జగనన్నా అంటూ, మావయ్యా అంటూ ముద్దులొలికే చిన్నారులు చూపే ప్రేమకు ఆ యువనాయకుడు ఫిదా అవుతూనే ఉన్నారు. ప్లకార్డులతో వెంట నడిచినా, తనపై చిరు కవితలు వినిపించినా, తన చెమటను చేరుమాలుతో తుడిచినా, ప్రేమగా నుదుటిపై ముద్దిచ్చినా ఆ చిన్నారుల కల్మషం లేని ప్రేమను మించిన అభిమానధనం ఏముంటుంది?
తనపై ఇంత ప్రేమ కురిపించే పిల్లల మనసుల్లో చిరస్థాయిగా ఉండాలని కోరుకున్నారు వైఎస్ జగన్. వారి బంగారు భవితకు తాను భరోసాగా నిలుస్తానని మాటిచ్చారు. అమ్మ ఒడి పథకం కానుకగా ఇచ్చారు. పిల్లల చదువులకయ్యే ఖర్చులను నేరుగా తల్లులకే అందజేస్తామని హామీ ఇచ్చారు వైఎస్ జగన్. మీ పిల్లల చదువుల బాధ్యత పూర్తిగా నాదని అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటానని జగన్ మాట ఇచ్చారు. పిల్లలను బడికి పంపండి. వారి అభివృద్ధికి నాది పూచీ అని ధైర్యం చెప్పారు. ఇచ్చిన మాట తప్పడం వైఎస్ కుటుంబ చరిత్రలో లేదని ఈ రాష్ట్రానికి తెలుసు.
లక్షల ఫీజులు, డొనేషన్ల పేరుతో ప్రైవేటు స్కూళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేస్తానని కూడా హామీ ఇచ్చారు వైఎస్ జగన్. ఫీజులు క్రమబద్ధీకరిస్తామని, ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరుస్తానని చిన్నారుల సాక్షిగా ప్రజాసంకల్ప యాత్రలో ప్రకటించారు ప్రతిపక్షనేత. తమ ఇంటి మనిషిగా చిన్నారుల మనసు గెలుచుకున్న జగన్ ను వారు మనసున్న మావయ్య అని పిలుచుకుంటున్నారు.

Related Post

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


www.000webhost.com