వెంకటగిరిపై ఆనం విజయబేరి

-ఒకేరోజు ఆత్మకూరు నియోజకవర్గంనుంచి వీడ్కోలు వెంకటగిరి నియోజకవర్గంలోకి స్వాగతం

– స్వార్థపరుల కబంధహస్తాల్లో చిక్కుకొన్న నియోజకవర్గవాసులని కాపాడుకునేందుకే వెంకటగిరికి వొచ్చా

– వెంకటగిరిని విద్యాకేంద్రంగా ,పారిశ్రామిక హబ్ గా మార్చి అభివృద్ధి అంటే ఏందో చూపిస్తా

– వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతీ ఎకరాకి సాగునీరు అందించే బాధ్యత నాది

– వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆనం విజయం ఖాయం

– రాబోయే ఎన్నికల్లో జిల్లాలో పది అసెంబ్లీ ,రెండు ఎంపీ స్థానాల్లో విజయడంకా మోగించి జగన్ మోహన్ రెడ్డికి నజరానాగా ఇస్తాం

– ప్రస్తుతం చంద్రబాబు నేతృత్వంలో నారాసుర టీడీపీ కొనసాగుతోంది

– జగన్ సీఎం ఐతేనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుంది

నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో వెంకటగిరి నియోజకవర్గ బాధ్యతలు చేపట్టి తొలిసారి పెనుశిల లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో నేతలు ,కార్యకర్తలతో సమావేశానికి బయలుదేరిన మాజీ మంత్రి అనం రామనారాయణరెడ్డి .పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించి వెంకటగిరి నియోజకవర్గ పర్యటనకు శ్రీకారం చుట్టినారు.ఈ క్రమంలోఆనం కు గ్రామగ్రామాన మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.

వెంకటగిరి నియోజకవర్గం లోని ఆరుమండలాల ముఖ్యనేతలు ,అభిమానులతో పెంచలకోనలో ఆనం సమావేశం నిర్వహించినారు. ఈసమావేశానికి ఆనంతో పాటుగావై.సి.పి. జిల్లాపార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ,మాజీ ఎంపీ వరప్రసాద్ ,ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి , మరియు పార్టీ ప్రముఖ నాయకులు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి హాజరైనారు.

 

ఈ  కార్యక్రమంలో  ఆనం రామనారాయణ రెడ్డి  మాట్లాడుతూ రాష్ట్రంలో సామాన్య ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది,శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైంది,ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నం జరిగి రోజులు గడుస్తున్నా కేసును పోలీసులు ఛేదించలేకపోవటం బాధాకరం,హత్యాయత్నం కేసులో ఏ ఒక్క ప్రశ్నకీ ప్రభుత్వం నుంచి సమాధానం లేదు, విచారణ డొల్లతనంగా సాగుతోంది.ప్రోటోకాల్ ఆఫీసర్ ,హోటల్ ఓనర్ ని ఎందుకు విచారించలేదు,డీజీపీ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. భద్రతతో పాటు ప్రజా సంక్షేమం లోనూ ప్రభుత్వం నిర్వీర్యం ఐపోయిందంటు టిడిపి సర్కార్ పై నిప్పులు చెరిగారు.

టీడీపీ ,కాంగ్రెస్ లది అనైతిక కలయిక;

ఇటలీ దెయ్యం అని ఆరోపించిన చంద్రబాబు ఇప్పుడు సోనియాతో చేతులు కలపటం దారుణం, నాడు సోనియా దెయ్యం ఐతే నేడు చంద్రబాబు రాష్ట్రం పాలిట నరకాసురిడిగా మారాడు,ఎన్డిఏని వీడిన చంద్రబాబు యూపీఏ పంచన చేరాడు, తనని తాను కాపాడుకునేందుకే చంద్రబాబు కాంగ్రెస్ కాళ్ళ దగ్గరకు చేరాడు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ కుటుంబ విభేదాలతో చిలువలు పలువులు అయ్యి పేలికగా మిగిలింది.ప్రస్తుతం చంద్రబాబు నేతృత్వంలో నారాసుర టీడీపీ కొనసాగుతోంది.జగన్ సీఎం ఐతేనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుంది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి ప్రతీకార్యకర్త సైనికుడిలా పనిచేయాలి  అని విజ్ఞప్తి చేసారు,

ఆత్మకూరు నియోజకవర్గంనుంచి వీడ్కోలు వెంకటగిరి నియోజకవర్గంలోకి స్వాగతం ఒకేరోజు జరిగాయి, జిల్లాలో ఏ గ్రామానికి వెళ్లినా ఆప్యాయంగా ముద్దపెట్టే మనుషులను సంపాదించుకొన్నా, స్వార్థపరుల కబంధహస్తాల్లో చిక్కుకొన్న నియోజకవర్గవాసులని కాపాడుకునేందుకే వెంకటగిరికి వొచ్చా, వెంకటగిరిని విద్యాకేంద్రంగా ,పారిశ్రామిక హబ్ గా మార్చి అభివృద్ధి అంటే ఏందో చూపిస్తా, వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతీ ఎకరాకి సాగునీరు అందించే బాధ్యత నాది,తెలుగుగంగ నీటిని కెనాల్ పరీవాహక ప్రాంతంలోని ప్రతీ చెరువుకి అందేలా చేస్తాను, నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయటమే లక్శ్యంగా ముందుకు సాగుతాను, సోమశిల స్వర్ణముఖి లింకు కెనాల్ పనులను పూర్తిచేసేందుకు కృషిచేస్తాను,నియోజకవర్గంలో పోటీ అంటే స్మగ్లర్లను ఎదురుకోవాల్సిన పరిస్థితి ఉంది .స్మగ్లర్లను మనోధైర్యంతో ,గుండె నిబ్బరంతో ఎదురుకొందాం అంటు సమరశంఖాన్ని పూరించారు ఆనం.

 

వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధనరెడ్డి మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో టీడీపీ కి ఓట్లేసినందుకు జనం బాధపడుతున్నారు,2019 ఎన్నికల్లో జగన్ ని సీఎం ని చేసి పొరపాటుని సరిదిద్దుకునేందుకు ప్రజలు సిద్ధమౌతున్నారు. వైఎస్ తరహాలో ప్రజారంజక పాలన చేయగల సత్తా జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే ఉంది,వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆనం విజయం ఖాయం. ఆనం రామనారాయణరెడ్డి పేరు ఖరారుచేయటంతో బలమైన అభ్యర్థిని వెతికే పనిలో టీడీపీ పడింది,రాబోయే ఎన్నికల్లో జిల్లాలో పది అసెంబ్లీ ,రెండు ఎంపీ స్థానాల్లో విజయడంకా మోగించి జగన్ మోహన్ రెడ్డికి నజరానాగా ఇస్తాం అని కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపారు.

Related Post

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


www.000webhost.com