ప్రభుత్వ సాయం తూతూ మంత్రం..

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి

విజయనగరంః తుపాను బాధితులను ఆదుకోవాల్సిన టీడీపీ ప్రభుత్వం ప్రచారానికే పరిమితమయ్యిందని ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి విమర్శించారు. నామమాత్రపు పరిహారాలు ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారన్నారు. ప్రభుత్వ తీరుపై బాధితులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారన్నారు. అపార నష్టం జరిగి ప్రజలు నిరాశ్రయులైన వారికి ఎటువంటి సాయం అందడం లేదన్నారు.తిండి,తాగునీరు,విద్యుత్‌ సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రతి మారుమూల గ్రామాల్లోకి వెళ్ళి బాధితులను ఆదుకోవలసిన ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడంలేదన్నారు.  తూతూమంత్రంగా టీడీపీ నాయకులు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారన్నారు.ప్రజల పక్షాన నిలబడుతున్న ప్రతిపక్షంపై అధికారపక్షం తీవ్ర ఆరోపణలు చేస్తుందన్నారు. చేతకాని అసమర్థతతో బాధితులకు సాయం అందించడంలో పూర్తిగా విఫలమై ఆ నెపాన్ని ప్రతిపక్షంపై నెట్టే ప్రయత్నం టీడీపీ చేస్తుందన్నారు.

Related Post

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


www.000webhost.com