నేరగాడైన సీఎంకు శిక్ష ఉండదా?

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి
– రేవంత్‌  ఇంట్లో ఐటీ దాడులు చేస్తే ఎల్లో మీడియా హడావుడి ఎందుకు?
– ఐటీ దాడుల్లో బయటపడుతున్న ఆస్తులు ఎవరివి?
– ఓటుకు కోట్లు కేసులో దొరికిన దొంగ భావోద్వేగానికి లోనైనట్టు కథనాలు
– చంద్రబాబును కాపాడుకునేందుకు ఇలా చేస్తున్నారా? 
– చట్టం, న్యాయం, రాజ్యాంగం తెలుగు రాష్ట్రాల్లో లేవా? 
– బాబును ఎందుకు అరెస్టు చేయడం లేదు?
– చంద్రబాబు చట్టానికి పూర్తిగా అతీతుడా? 
– చంద్రబాబు మైనింగ్‌ దోపిడీకి ఎమ్మెల్యే కిడారి బలయ్యారు
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి, అరాచకాలపై వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. నేరగాడైన ముఖ్యమంత్రికి శిక్ష ఉండదని చంద్రబాబు భావిస్తున్నారా? ఆయన చట్టానికి పూర్తిగా అతీతుడా అని నిలదీశారు. రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు జరిగితే ఆయనపై పంజా విసిరారని, చంద్రబాబును కాపాడేందుకు ఎల్లో మీడియా హడావుడి చేస్తుందని మండిపడ్డారు. శుక్రవారం ౖÐð యస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో భూమన మీడియాతో మాట్లాడారు.  రేవంత్‌రెడ్డిపై జరుగుతున్న దాడుల్లో భయటపడుతున్న ఆస్తులు ఎవరివని ఆయన ప్రశ్నించారు. రేవంత్‌ ఇంట్లో ఐటీ దాడులు చేస్తే ఎల్లో మీడియా హడావుడి ఎందుకని నిలదీశారు. నిన్న తనపై ఐటీ దాడులు చేస్తే ఎల్లో మీడియా రేవంత్‌రెడ్డిపై పంజా, భావోద్వేగానికి గురయ్యారో అని ఎంత చక్కటి నాటకం ఆడి, ఆయన్ను సమర్ధిస్తూ, వీడియో సాక్ష్యాలతో ఓటుకు నోటు కేసులో ప్రపంచానికి తెలిసిన దొంగను భావోద్వేగానికి గురైనట్లు చెప్పడం వెనుక దాగి ఉన్న సత్యమేంటి? ఇంతగా తన అధినేతను కాపాడుకోవడానికి కులగజ్జి దాడి ఉందా అన్న అనుమానాలు వస్తున్నాయన్నారు. రేవంత్‌రెడ్డిని ఎందుకు సమర్ధిస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి ఐటీ దాడులు ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో లేవా అని నిలదీశారు.
చంద్రబాబును ఈ రోజు వరకు ఓటుకు నోటు కేసులో తెలంగాణ పోలీసులు ఎందుకు పిలవడం లేదన్నారు. దాదాపు మూడేళ్లు పూర్తవుతున్నా ఎందుకు పిలవడం లేదన్నారు. పథకం పన్నినవారిని, కొనుగోలుకు సూత్రదారి అయిన చంద్రబాబును ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నించారు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబుపై చార్జిషిట్‌ వేస్తే నాలుగేళ్లుగా తెలంగాణ పోలీసులు ఆయన్ను విచారణ చేయకపోవడానికి దాగి ఉన్న మతలబు ఏంటని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు.
నేరాగాడైన ముఖ్యమంత్రికి శిక్ష ఉండదని ఏమైనా వదిలేస్తున్నారా అని భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఏపీలో 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు సంతలో పశువులను కొన్నట్లుగా కొనడానికి ఆయనకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని దుయ్యబట్టారు. తాను ఏమి చేసినా ప్రశ్నించే వారు లేరని, దేశంలో ఉన్న చట్టం, న్యాయం, రాజ్యాంగం అన్నది సీఎంగా ఉన్న చంద్రబాబుకు వర్తించవా? అని నిలదీశారు. ఆయన ఎన్ని అక్రమాలు చేసినా, ఆస్తులు కూడబెట్టినా? ప్రజా సంపదను ఎంతగా దోచుకున్నా, విదేశాల్లో ఎంతైనా దాచుకున్నా..విచారణ ఉండదు అన్న ధీమా తప్ప మరొకటి కాదా అన్నారు. చంద్రబాబుకు కొత్త చట్టం ఏదైనా వచ్చిందా అని నిలదీశారు. అడ్డగోలుగా సాక్ష్యాధారాలతో దొరికిపోయిన ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయడం లేదని మండిపడ్డారు.
చంద్రబాబును విచారణకు పిలువలేదంటే ఆయన చట్టానికి, న్యాయానికి, రాజ్యాంగానికి పూర్తిగా అతితుడని కొత్త భ్యాష్యం ఏదైనా ఈ రాజ్యాంగంలో ఉందా అన్నారు. చంద్రబాబు వంటి గజ దొంగను వదిలివేయబట్టే కదా ఈ రోజు కోలంబియా విశ్వవిద్యాలయం, ఐక్యరాజ్యసమితి అంటూ అమెరికాలో నానా చెత్త మాట్లాడే ధైర్యం ఆయనకు వచ్చిందన్నారు. చేయని పనులన్నీ కూడా తానే చేశారని వి్రరవీగే ఆత్మసై్థ్యర్యంతో మాట్లాడుతున్నారంటే, ఈయన గారి భార్యపేరు మీద రూ.1200 కోట్ల అధికారిక ఆస్తులు, ఆయన కుమారుడు లోకేష్‌ పేరు మీదుగా అధికారికంగా రూ.500 కోట్లు, మనవడు పేరు మీదుగా ఉన్న ఆస్తులపై ప్రశ్నించే నాథుడే కరువయ్యాడన్న ధీమా చంద్రబాబుకు అణువణువునా జీర్ణించుకుపోయింది కాబట్టి అమెరికా వెళ్లి కూడా అనర్గళంగా అబద్ధాలు చెప్పగలుగుతున్నారని విమర్శించారు. శాసన సభలో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, అందులో నలుగురిని మంత్రులుగా చేసి అతి గొప్పదైన ప్రజాస్వామ్యదేశంలో తాను ఏమి చేసినా చెల్లుతుందని అమెరికాలో మాట్లాడుతున్నారన్నారు. ఏ వ్యవస్థనైనా మేనేజ్‌ చేసుకునే సామర్థ్యం తనకు ఉందని, ఎన్ని తప్పులు చేసినా, దోపిడీ చేసినా, రాష్ట్రాన్ని లూటీ చేసినా ఆక్షేపించేవారు లేరన్న ధైర్యం తప్పా..మరొకటి కాదన్నారు.
ఓటుకు కోట్లు కేసులో సంబంధం ఉన్న వ్యక్తులందరిని వెంటనే హైదరాబాద్‌ వదిలి అండర్‌ గ్రౌండ్‌కు వెళ్లమని మంత్రి లోకేష్‌ చెబుతున్నారన్నారు. ఎక్కడ పొరపాటున ఆ దొంగలు దొరికిపోతారన్న భయంతో వారందరికి లోకేష్‌ ఆదేశాలు ఇస్తున్నారని, సభ్య సమాజాన్ని అవమానపరిచి, తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరినైనా అవినీతిపరులను చేయడానికి వెనుకంజ వేయని వ్యక్తిగా చంద్రబాబు ముద్ర పడ్డారని, తనపై సాక్ష్యాధారాలు వచ్చినా సరే ఇప్పటికీ కూడా తెలంగాణ పోలీసుల నుంచి చిన్న తాకీదు కూడా అందుకోలేదన్నారు. చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని, విచ్చలవిడి దోపిడీ కారణంగా నాలుగున్నర లక్షల కోట్లు బాబు లూటీ చేశారని ఆరోపించారు.
ఏపీలో మైనింగ్‌ దోపిడీకి టీడీపీ నేతలకు యధేచ్చగా అనుమతులు ఇవ్వడం వల్లే గిరిజనులపై ఏనాడు కూడా సరైనా సదాభిప్రాయం లేనటువంటి చంద్రబాబును నమ్మలేదని, అందుకే ఒక్క గిరిజన టీడీపీ ఎమ్మెల్యేను కూడా గెలిపించలేదన్నారు. చంద్రబాబుకు ఉన్నటువంటి ప్రభుత్వ ఇంటలీజెన్స్‌ అధికారులు కేవలం పచ్చ చొక్కాలకు ఊడిగం చేయడానికే పనికి వస్తున్నారని, నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. ఎవరికీ ఏ రకమైన ప్రమాదం ఉంది అన్న సమాచారం సేకరించకుండా, చంద్రబాబు దుర్మార్గాలను కాపాడటానికే ఇంటలిజెన్సీ వ్యవస్థ పని చేస్తుందని మండిపడ్డారు. ఆ దురాఘతం కారణంగానే గిరిజన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యకు దారి తీసిందన్నారు.  ఎమ్మెల్యే కిడారిని మావోలు హత్య చేస్తే వైయస్‌ఆర్‌సీపీకి అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబుపై అలిపిరిలో దాడి జరిగితే అప్పట్లో వైయస్‌ రాజÔó ఖరరెడ్డిపై నెట్టారని గుర్తు చేశారు. చంద్రబాబు చేతిలోనే ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉన్నా కూడా ఏ విషయంపైనైనా ఆయన విచారణ జరిపించి ఎవరు బాధ్యులో స్పష్టం చేసే అవకాశం ఉన్నా..సోమయాజులు ఇచ్చిన రిపోర్టు మాదిరిగా కాకుండా సరైన విచారణ చేయించి, నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. ఎవరి మరణం వెనుక, ఏ దోపిడీ వెనుక, దందా, అవినీతి, కుట్ర, దుశ్చర్య వెనుక ఉన్న దొంగలు, దోషులు ఎవరో కచ్చితంగా బయటకు వస్తుందన్నారు. చంద్రబాబు ఆ పని చేయడని, తన వద్ద ఉన్న పనికి మాలిని దద్దమ్మలతో వైయస్‌ఆర్‌సీపీపై బురదజల్లించి పబ్బం గడుపుకుంటున్నారన్నారు. చంద్రబాబు అరాచకాలకు కచ్చితంగా అంతం ఉంటుందని, శ్రీకృష్ణ జన్మస్థలానికి వెⶠ్లడానికి అవసరమైన అన్ని కారణాలు ఈ నాలుగేళ్లలో గోచరిస్తున్నాయని, బాబు పాలనకు అంతిమ గడియలు దాపురించాయన్నారు. చంద్రబాబు పాలన ముగింపు దశకు చేరుకోవడంతోనే అరాచకాలకు అవధులు లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు పాలన రాక్షస పాలను తలపిస్తుందని ప్రజలు భావిస్తున్నారని భూమన తెలిపారు.

Related Post

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


www.000webhost.com