– పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన వైయస్ జగన్
– వేలాది మంది అనుచరులతో తరలివచ్చిన మాజీ సీఎం తనయుడు
విశాఖ: ప్రజల కోసం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు వివిధ పార్టీల నాయకులు వైయస్ఆర్సీపీ వైపు ఆకర్శితులవుతున్నారు. నవరత్నాలతో అన్ని వర్గాలకు మేలు జరుగుతాయని భావించిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెందుర్తి నియోజకవర్గంలో కోటనరవ హనుమాన్ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి తనయుడు రామ్‌కుమార్‌ను వైయస్ఆర్సీపీలోకి ఆహ్వానిస్తూ వైయస్ జగన్మోహన్రెడ్డి కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. రామ్‌కుమార్‌రెడ్డి వెంట వేలాదిగా అనుచరులు తరలివచ్చి వైయస్ఆర్సీపీలో చేరారు. వీరి చేరికతో నెల్లూరు జిల్లాలో వైయస్ఆర్సీపీ బలోపేతమైంది.
Be the first to comment