రాజకీయాలకు కొత్తభాష్యం వైయ‌స్ఆర్‌

జనం మెరుగైన జీవితాన్ని సాగించడానికి అవసరమైన పరిస్థితులను సృష్టించగలిగిన వాడే రాజకీయ నాయకుడు. ఆ విధంగా పరస్థితుల్ని, వ్యక్తుల్ని, సమాజాన్ని పురోగమనం వైపు మార్చడంపై ఆలోచించి, ఆచరించిన దార్శనికుడు, ఉదారవాది, జనరంజక పాలకుడు, జనాకర్షక నాయకుడిగా దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి చ్రరితలో నిలిచిపోయాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయనొక ధృవతార. దిశానిర్దేశం చేసిన తార. జన ఆకాంక్షలకు ఆయనొక¯ ప్రతీక, జనం గుండెల్లో  ఎన్నటికీ చెరపలేని ముద్ర ఆయనది. నమ్మకం ఆయన ఇంటిపేరయింది. సంక్షేమం ఆయన నిరంతరం ఆలోచించే ‘నిరుపేదల పేరు’ అయింది. ఆయన అనుకుంటే కాంగ్రెస్‌ మరణశయ్య నుంచి ఏపీలో లేచి కూచుంటుంది. ఆయన నవ్వుతూ చేయి ఊపితే గెలువలేని నేత కూడా గెలిచి కూర్చుంటాడు. ఆయన కృషితో కేంద్రంలోనే పార్టీ అధికారంలో కూర్చుంటుంది. ఆయనే ఆదేశిస్తే జనం కోసం రిలయన్స్‌ వంటి బడాబాబూలూ, మోన్‌శాంటో వంటి విత్తనాధిపతులూ మెడలు దించాల్సిందే. ఒక్క బిడ్డయినా చదువుకోలేదంటే ఆయన కంట్లో కన్నీళ్లు కారతాయి.
ఒక్క మనిషైనా వైద్యం పొందలేకుంటే ఆయన గుండె తరుక్కుపోతుంది. ఒక నోట్లో ముద్ద పడకున్నా ఆయన హృదయం అల్లాడిపోతుంది. ఒక్క రైతు అప్పుల్లో సతమతమవుతున్నా ఆయన మనస్సు గిలగిలా కొట్టుకుంటుంది. ఒక్క రైతుకు సాగునీరు లేకున్నా, కరెంటు లేకున్నా,గిట్టుబాటు ధర, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు లేకున్నా ఆయన కుదురుగా కూర్చోలేడు. ఒక్క పేద మహిళకు పావలా వడ్డీకి రుణం అందుకున్నా ఆయన ఆవేదన ఆపలేనిదవుతుంది. పార్టీలకు అతీతంగా, ప్రభుత్వ పథకాల మేళ్లు ఓ ఒక్కరికి అందకున్నా ఆయన అధికారులను పెరిగెత్తిస్తాడు. అది విద్యా సమస్యా, వైద్య సమస్యా, రైతు సంక్షేమమా, మహిళాభివృద్ధా, యువతకు ఉద్యోగ, వృద్ధులు, దివ్యాంగులు, వితంతు పింఛన్లు వంటి అవసరాలా ఇంకే దైనానా అనే దాంట్లో తేడా ఉండదు. ఇక ఆయన ముస్లిం రిజర్వేషన్లు ఒక సంచలనం. ఆయన ప్రవేశపెట్టిన ఎస్సీ,ఎస్టీ పథకాలు ఉహకందనివి. బీసీ సంక్షేమ కార్యక్రమాలు నిత్యనూతనాలు, అసలు ఆయన మేనిఫెస్టోనే తప్పనిసరిగా ‘చేసి తీరే పట్టిక’ అది అన్నివర్గాల ప్రజలకూ మేలు చేసే రాజన్న శాసనం. అందుకే ఆయన్ని తప్పుగా ఒక మాటన్నా జనం చేతులు పైకి లేస్తాయి. ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమాల్ని చెరపాలనుకునేవాళ్లుకు జనం రాజకీయంగా బుద్ధి చెబుతారు. ఆయనంటేనే జనం పడిచస్తారు. అందుకే ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక వందలాది జనం కన్నుమూశారు. ఇది,. ప్రపంచచ్రరితలో ఇప్పటివరుకు జరిగిన ఒకే ఒక్క అరుదైన సంఘటన. అందుకే ఆయన పథకాలన్నీ నీరుగార్చి, ఆయన ప్రతిష్ఠను తగ్గించాలనుకొనే సీఎంలు కూడా వాటిని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రద్దు చేయలేకున్నారు.
ఇంతటి మహానేత కావుననే జనం ఆయన్ను రాజన్న అన్ని ముద్దుగా పిలుచుకొంటున్నారు. అసలు జనం దృష్టిలో ఆయనొక ‘విరాట్‌ స్వరూపం, జగన్‌ ఆయన అంశం. ఇందుకు కారణం, భారతీయ సంస్కృతిలో ‘పదిమందికి మంచి పనులు చేసి, మంచి మాటలు చెప్పి మంచిమార్గంలో జనాన్ని నడిపిన వ్యక్తి ‘దేవుడు’గా పరిగణిస్తారు.‘పందిమందికి’ చెడుపనులు చేసి, చెడు మాటలు చెప్పి చెడు మార్గంలో జనాల్ని నడిపిన వ్యక్తిని రాక్షసుడుగా పరిగణిస్తారు. అంటే మానవుల్లోని ఉన్నతమైన గుణాలకు ప్రాచీన మానవులు దైవస్థానం ఇచ్చారు. అలాంటి గుణాలు గల వారిని దైవం అన్నారు. అందుకే జనం గుండెల్లో ఇప్పటికీ వైఎస్సార్‌ దైవంగా నిలిచిపోయి ఉన్నాడు. ఆయన ‘ఆత్మ’ జగన్‌ రూపంలో, విజయపథంలో నడిపిస్తోన్న పార్టీగా జనం ‘వైయ‌స్ఆర్‌ సీపీ’ని భావిస్తున్నారు. అందుకే ‘ఆత్మ’లేని పార్టీగా కాంగ్రెస్‌ మిగిలిపోయింది ‘సంక’కెత్తుకొన్న అన్ని పార్టీలనూ ‘చిదిమేసిన’ బాబు టీడీపీ కోసం ప్రస్తుతం కాంగ్రెస్‌తో పార్టీ ఆ్రరులు చాస్తోంది. ఆంతో ఇంతో మిగిలివున్న కాంగ్రెస్‌ ఓట్లరేమో ఇందిరమ్మ ‘ఆత్మప్రబోధం’ బాటలో పయనించి వైయ‌స్ఆర్‌ ఆత్మ ఉన్న వైయ‌స్‌జగన్‌ పార్టీకే ఓటు వేయడానికి సిద్ధపడుతున్నారు.
                                                                                             –డాక్ట‌ర్ .దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి
                                                                                     (సెప్టెంబర్‌ 2న వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి)

Related Post

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


www.000webhost.com