నాన్నగారి హయాంలో భరోసా ఉండేది

వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

– చంద్రబాబు పాలనంతా అవినీతిమయం
– చంద్రబాబు పాలనలో ఎ పంట కూ గిట్టుబాటు ధర లేదు
– అధికారంలోకి రాగానే చెరకు రైతులను ఆదుకుంటాం
– నర్సీపట్నం– భీమిలి రోడ్డు విస్తరణను పట్టించుకునే నాథుడు లేడు
– హెరిటేజ్‌లో కేజీ బెల్లం రూ.84, రైతు వద్ద కేజీ రూ.24 చొప్పున కొనుగోలు 
– ఉలి కేజీ రూ.4 కొని..హెరిటేజ్‌లో రూ.25లకు అమ్ముతున్నారు
– మంత్రి యనమలకు పంటి నొప్పి వస్తే సింగపూర్‌ వెళ్తారు
– బీజేపీతో సంసారం చేస్తున్నప్పుడు బాబుకు హోదా గుర్తుకు రాలేదు
– పేదవాడు వైద్యం కోసం హైదరాబాద్‌ వెళ్తే ఆరోగ్యశ్రీ కట్‌ చేస్తారట
– ఉత్తరాంధ్ర జిల్లాలో ఇటీవల జ్వరాలతో 200 మంది మృత్యువాత పడ్డారు
– ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ ఇంగ్లీష్‌ మీడియం చేస్తాం
 విశాఖ: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో పేదలకు ఒక భరోసా ఉండేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. పేదలు విద్యా, వైద్యం కోసం అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రతి ఒక్కరికి నాన్నగారు తోడుగా ఉండేవారని గుర్తు చేశారు. మహానేత మన మధ్య నుంచి వెళ్లిపోయాక మళ్లీ చదువుల కోసం, వైద్యం కోసం అప్పులపాలు కావాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితిని మార్చుతానని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చోడవరం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు.
ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..
– ఈ నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు ఇక్కడి ప్రజలు నాతో అన్న మాట..అన్నా..మా జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. 2014లో చంద్రబాబుకు మా జిల్లాలో 12 నియోజకవర్గాలు ఇచ్చామన్నా..అవి చాలవని మరో ఇద్దరు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లుగా కొనేశార న్నా..14 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తన పక్కనే పెట్టుకున్నారన్నా..అన్నా..చంద్రబాబు మాకు చేసింది ఏంటన్నా అని అడుగుతున్నారు. ఇదే చోడవరం నియోజకవర్గానికి ఆయన చేసింది ఏంటన్నా..
– అన్నా ..వీళ్లు చేసింది ఏంటంటే..చంద్రబాబు డైరెక్షన్‌లో దేన్ని కూడా వదలకుండా మట్టి, ఇసుకతో కలిపి సర్వం దోచేస్తున్నారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.
– అన్నా..బుచ్చయపేట మండలంలోని తాళ్లపూడి, పెద్దమదీనాలో ప్రభుత్వ భూములను కూడా వదిలిపెట్టలేదని చెబుతున్నారు. తొట్టిదొర పాలెంలో దళితుల భూములు కూడా వదిలిపెట్టలేదు. దాదాపు రూ.54 కోట్లు విలువ చేసే 130 ఎకరాలు ఆక్రమించుకున్నారు. జేపీ అగ్రహారంలో కొన్ని దశాబ్ధాలుగా పేద రైతులు దున్నుకుంటున్న 420 ఎకరాల భూములను నకిలీ పట్టాలు సృష్టించి స్వాహా చేసేందుకు చూస్తున్నారని చెబుతున్నారు. ఇసుక ర్యాంపుల్లో ఏకంగా పొక్లైన్లు పెట్టి వేల కోట్లు దోచుకుంటున్నారని చెబుతున్నారు. చంద్రబాబు ఇసుక ఫ్రీగా ఇస్తున్నామని చెబుతున్నారు. ఇక్కడి ప్రజలకు ఇసుక ఫ్రీ  ఇవ్వలేదని, రెండు యూనిట్ల ఇసుక రూ.16 వేలకు అమ్ముతున్నారని చెబుతున్నారు.
– తూటకూర పాలెంలో గ్రానైట్‌ వదిలిపెట్టడం లేదు. అనుమతికి మించి మైనింగ్‌ చేస్తుంటే లంచాలు తీసుకుని ఎమ్మెల్యే పబ్బం గడుపుతున్నారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. పలు చెరువుల్లో నీరు–చెట్టు కింద ఏకంగా పనులు చేయకపోయినా చేసినట్లు బిల్లులు పెట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని చెబుతున్నారు.
– పింఛన్ల మంజూరులో మానవత్వం చూపడం లేదన్నా..కందిపల్లికి చెందిన దుర్గాప్రసాద్, పోలియోకు గురైన బాలిక ఆశాకు పింఛన్లు మంజూరు కావాలంటే కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నా అని చెబుతున్నారు. ఈ ఇద్దరు కూడా నాతో కలిసి చెప్పిన గాథలు
– వియ్యపు సోమనాయుడు అంగవికలుడైన పింఛన్‌ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినా పట్టించుకోని ప్రభుత్వం ఇది.
– ఇక్కడి రైతులు నా వద్దకు వచ్చి అన్నా..చోడవరం ఫ్యాక్టరీ గురించి చెబుతూ..దాదాపు 24 వేల మంది రైతులు ఈ ఫ్యాక్టరీపై ఆధారపడ్డారన్నారు. గతంలో చంద్రబాబు ఏకంగా రూ.45 కోట్ల నష్టాల్లోకి నెట్టేశారు. కో–ఆపరేటివ్‌ రంగంలోని ఏ ఫ్యాక్టరీలను బతకనివ్వడం లేదు. ఆ తరువాత తన బినామీలకు కట్టబెట్టారని చెబుతున్నారు. గతంలో ఎంవీవీఎస్‌ మూర్తికి కేటాయిస్తే కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని చెబుతున్నారు. నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తరువాత షుగర్‌ ఫ్యాక్టరీని ఆదుకున్నారు. ప్రతి రైతుకు కూడాదాదాపు రూ.400 బోనస్‌ ప్రకటించి తోడుగా నిలిచారు. చోడవరం ఫ్యాక్టరీకి రూ.45 కోట్లు లాభాల్లోకి తీసుకొచ్చిన ఘనత వైయస్‌ఆర్‌ది అని చెబుతున్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావడం, ఈ ఫ్యాక్టరీ రూ.100 కోట్ల నష్టాల్లోకి వెళ్లిందని చెబుతున్నారు. టీడీపీ నాయకులు ద గ్గరుండి దోచుకుంటున్నారని చెబుతున్నారు. ఎంపీ సుజనాచౌదరి బినామీకి చౌకగా తడిసిన షుగర్‌ను కట్టబెట్టారని చెబుతున్నారు. టన్ను మెలాసిస్‌ను రూ.7300కు కట్టబెట్టారని, దీని వల్లే ఫ్యాక్టరీ నష్టపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ బాగుపడాలన్నా..రైతులకు మేలు జరుగాలన్నా చంద్రబాబును బంగాళఖాతంలో కలపాలి.
– రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్‌ అనే నేను..మీ అందరికి హామీ ఇస్తున్నాను. విశాఖ జిల్లాలోని కో–ఆపరేటివ్‌ రంగంలోని అన్ని చక్కెర ఫ్యాక్టరీలను ఆదుకుంటానని, రైతులకు తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నాను.
– రైతులు ఇవాళ చెరకు అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నారని చెబుతున్నారు. రేటు లేక బెల్లం తయారి చేసి అమ్ముకుందామంటే దానికి కూడా గిట్టుబాటు ధర లేక వ్యవసాయం మానేస్తున్నామని చెబుతున్నారు. అన్నా..2007–2008లో సీజన్‌ నాటికి  బెల్లం క్వింటాళ్లు దిగుబడి తగ్గిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెరిటేజ్‌ షాపుల్లో కేజీ రూ.84 అమ్ముతున్నారు. అదే రైతు వద్ద మాత్రం రూ.25లకు కొనుగోలు చేస్తున్నారు.
– అన్నా..రైవాడ, పెడ్డేరు, కళ్యాణకాల్వ రిజర్వాయర్ల మరమ్మతులకు నాన్నగారు నిధులు కేటాయించినా..ఆ పనులు ఇవాల్టికి నత్తనడకనా సాగుతూనే ఉన్నాయి. నాన్నగారి హాయంలో ఈ ఒక్క నియోజకవర్గంలోనే దాదాపు 25 వేల ఇళ్లు కట్టారని చెబుతున్నారు. నాన్నగారు మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత చంద్రబాబు ప్రభుత్వం ఊరికి ఐదు ఇళ్లు కూడా కట్టలేదు.
– నియోజకవర్గంలో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. 25 గ్రామాల్లో రక్షిత మంచినీరు కరువైందని చెబుతున్నారు. పైప్‌లైన్‌ ద్వారా నీరు ఇస్తామన్న టీడీపీ నాయకులు ఇంతవరకు పట్టించుకోలేదు.
– నర్సిపట్నం–భీమిలి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని మొరపెట్టుకుంటున్నా పట్టించుకునే నాథుడు లేడని చెబుతున్నారు.
మోసం చేసేవాడుకు మనకు నాయకుడు కావాలా?
– మరో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. మనందరం ఓటు వేసేటప్పుడు మనకు ఎలాంటి నాయకుడు కావాలో గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయండి. అబద్ధాలు చెప్పేవారు, మోసాలు చేసేవారు మీకు నాయకుడు కావాలా? నాలుగేళ్ల చంద్రబాబు పరిపాలన చూడండి. ఇవాళ రైతుల పరిస్థితి తీసుకుంటే..రైతులకు ఏ పంట వేసినా గిట్టుబాటు ధర లేదు.
– ఈ మధ్యకాలంలోనే కర్నూలు మార్కెట్‌లో కేజీ ఉల్లి రూ.4 చొప్పున కొంటున్నారు. నెల్లూరులో బత్తాయి టన్ను రూ.1200 కూడా పలకడం లేదట. బెల్లం రూ.25 అమ్ముకోలేకపోతున్నాం. చంద్రబాబు షాపులో కేజీ రూ.20 చొప్పున అమ్ముతున్నారు. బత్తాయి కేజీ రూ.45 చొప్పున అమ్ముతున్నారు. ఇంతటి దారుణంగా రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వాన్ని చూసిన రైతుకు భరోసా ఉండాలి. కానీ దళారీలకు సీఎం నాయకుడిగా మారారు.
– చంద్రబాబు పాలనలో రైతులకు రుణమాఫీ కాలేదు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని, చివరికి వడ్డీలో నాలుగో వంతు కూడా మాఫీ చేయలేదు. ఎన్నికల సమయంలో బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. ఇవాళ బ్యాంకుల్లో బంగారాన్ని వేలం వేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని రామయ్య దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులకు ఇవాళ సున్నా వడ్డీ, పావలా వడ్డీ రుణాలు లేవు. అక్కా చెల్లెమ్మలకు రుణాలు అందడం లేదు. గతంలో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వడ్డీలేని రుణాలు అందేవి. గత ప్రభుత్వాలు వడ్డీ డబ్బులు బ్యాంకులకు చెల్లించేవి. చంద్రబాబు సీఎం అయ్యాక మాఫీ చేయకపోవడం మోసమైతే, ఆయన బ్యాంకులకు వడ్డీ డబ్బులు కట్టకుండా అన్యాయం చేశారు.
– ఈ పెద్ద మనిషి చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. ఆ రోజు జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే ప్రతి నెల రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చారు. బాబు సీఎం అయి 51 నెలలు దాటింది. ప్రతి ఇంటికి చంద్రబాబు రూ.1.02 లక్షలు బాకీ పడ్డారు. ఈ యన హాయంలో ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. ఎన్నికలకు నాలుగు నెలల ముందు కొత్త సినిమా తీస్తున్నారు. కోటి 70 లక్షల ఇళ్లులు ఉంటే ఎన్నికలకు నాలుగు నెలల ముందు నెలకు వెయ్యి చొప్పున కేవలం 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ ప్రకటన చేసి మూడు నెలలు అయ్యింది అది కూడా ఇంతవరకు లేదు.
– ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏపీకి 15 ఏళ్లు ప్రత్యేక హోదా తెస్తానని ఊదరగొట్టారు. ఎన్నికలు అయిపోయిన తరువాత లేని ప్యాకేజీలు ఉన్నట్లుగా భ్రమలు కల్పించారు. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేశారు. ఏ నాడు ప్రత్యేక హోదా అడగలేదు. నేరం ఎవరి మీదో  ఒకరిపై నెట్టాలి కాబట్టి మొదటి పెళ్లాం మంచిది కాదంటున్నారు. వెంటనే రెండో పెళ్లం కోసం పరుగులు తీస్తున్నారు చంద్రబాబు. ఆ రెండు పెళ్లం మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన పార్టీ.
– చంద్రబాబు విశాఖలో మీటింగ్‌లు పెట్టారు. 40 లక్షల ఉద్యోగాలు, రూ.20 వేల కోట్ల పెట్టుబడులు అని ఊదరగొట్టారు. ధర్మ పోరాట దీక్షలు అంటూ డ్రామాలు ఆడుతున్నారంటే రాష్ట్రంలో న్యాయం, ధర్మం బతికి ఉన్నాయా? చంద్రబాబు చేస్తున్న అన్యాయానికి ఇదే జిల్లాలో ప్రత్యేక హోదా కోసం త్రినాథ్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. తిరుపతిలో మునికోటి అనే వ్యక్తి 2015, ఆగస్టు 9న ఆత్మహత్య చేసుకున్నారు. ఆ రోజే చంద్రబాబుకు జ్ఞానోదయం అయి ఉంటే ఈపాటికి ప్రత్యేక హోదా వచ్చి ఉండేది కాదా?
– పోలవరం ప్రాజెక్టు పునాదుల స్థాయి నుంచి ముందుకు కదలడం లేదు. ఏది చూసినా అవినీతిమయమే. ఇసుక నుంచి మట్టి దాకా, బొగ్గు, కరెంటు కోనుగోలు, మద్యం, రాజధాని, విశాఖ భూములు ఏది వదలకుండా అంగుళం అంగుళం చొప్పున చంద్రబాబు మింగేస్తున్నారు. చంద్రబాబుకు దేవుడు అంటే భయం లేదు. భక్తీ లేదు. చివరకు దేవుడి భూములు కూడా లంచాలు తీసుకొని అమ్మేస్తున్నారు.
బాదుడే బాదుడు.
– చంద్రబాబు హయాంలో కరెంటు చార్జీలు బాదుడే బాదుడు. పెట్రోలు, డీజిల్‌ రేట్లు ఇతర రాష్ట్రాలతో పోల్చితే ప్రతి లీటర్‌పై రూ.6 అదనంగా బాదుతున్నారు. ఆర్టీసీ బస్సులు వదిలిపెట్టడం లేదు. ఇంటి పన్నులు,  చివరికి స్కూల్‌ ఫీజులు వదిలిపెట్టడం లేదు. ఇవాళ పేదవాళ్లు తమ పిల్లలను పంపించాలంటే ఏడాదికి రూ.30 వేలు గుంజుతున్నారు. చంద్రబాబు హయాంలో ఆ ఫీజులు, ఈ ఫీజులు అంటూ తడిసి మెపెడవుతున్నాయి.  ఇంటర్‌లో రూ.65 వేలు , నారాయణ, చైతన్య కాలేజీల్లో మనపిల్లలు ఇంటర్‌ చదవాలంటే అక్షరాల రూ.1.60 లక్షలు గుంజుతున్నారు. హాస్టల్‌ ఫీజులు, పరీక్ష ఫీజులు అంటూ ఏడాదికి రూ.3 లక్షలు గుంజుతున్నారు. ఇంతటి దారుణంగా చంద్రబాబు పాలన ఉంది. ఒకవైపు ప్రయివేట్‌ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వ రంగ స్కూళ్లను రేషనలైజేషన్‌ పేరుతో మూత వేయిస్తున్నారు. ఖాళీగా 20 వేల టీచర్‌ పోస్టులు ఉన్నా కూడా ఆ పోస్టులు భర్తీ చేయడం లేదు. డీఎస్సీ పెట్టడం లేదు. కానీ ఆ విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసేందుకు టెట్‌ 1, టెట్‌ 2, టెట్‌ 3 అంటూ గుంజుతున్నారు.
– మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు 6 నెలలుగా బకాయిలు ఉన్నాయి. దగ్గర ఉండి చంద్రబాబు ఈ పథకానికి తూట్లు పొడుస్తున్నారు. ఆగస్టు వచ్చినా కూడా 20 శాతం యూనిఫాం, పుస్తకాలు ఇవ్వడం లేదు.
ఎన్ని లక్షలు ఖర్చైనా నేను చదివిస్తాను. 
– రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మీ అందరికి హామీ  ఇస్తున్నాను..జగన్‌ అనే నేను చెబుతున్నాను. స్కూల్‌ ఫీజులు, కాలేజీ ఫీజులు గగిస్తానని మాట ఇస్తున్నాను. ప్రభుత్వ రంగంలోని ప్రతి స్కూల్‌ను ఆదుకుంటాం. మూతపడిన స్కూళ్లను లె రిపిస్తాను. ప్రతి స్కూల్‌ను ఇంగ్లీష్‌ మీడియం అమలు చేస్తాం. ఖాళీ పోస్టులను భర్తీ చేస్తాం. వ్యవస్థను మార్చడమే కాదు నవరత్నాల్లో కూడా చెప్పాను. బడికి పంపించినందుకు ప్రతి అక్కచెల్లెమ్మకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తానని మాట ఇస్తున్నాను. చదువురాని వారు  ఒక్కరు కూడా లేకుండా చేస్తాను.
– ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని చంద్రబాబు నీరుగార్చారు. పిల్లలు పెద్ద చదువులు చదవాలంటే ఈ పథకం ఉపయోగకరంగా ఉంటుంది. నాన్నగారి హయాంలో ఒక భరోసా ఉండేది. నా పిల్లలను వైయస్‌ఆర్‌ చదివిస్తాడు అన్న భరోసా ఉండేది. నాన్నగారు చనిపోయాక పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. చంద్రబాబు దరగ్గరుండి కాలేజీ ఫీజులు పెంచుతూ పోతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ముష్టి వేసినట్లు రూ.30 వేలు ఇస్తున్నారు. ఇది రూడా రెండేళ్లుగా ఇవ్వడం లేదు. మిగతా డబ్బులు చెల్లించేందుకు ఆ తల్లిదండ్రులు  ఇల్లు, పొలం అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ పాలనలో మన పిల్లలను ఇంజినీరింగ్, డాక్టర్లుగా చదివించే పరిస్థితిలో ఉన్నామా? ఈ పరిస్థితిని మార్చుతాను. ప్రతి అక్క, చెల్లెమ్మకు చెబుతున్నాను. మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి..ఎన్ని లక్షలు ఖర్చైనా నేను చదివిస్తాను.
– ఆరోగ్యశ్రీ పరిస్థితి చంద్రబాబు పాలనలో అధ్వాన్నంగా మారింది. పేదవాడు అప్పులపాలు అయ్యేది వైద్యం కోసం లక్షలు ఖర్చు అయినప్పుడే. వైద్యం చేయించుకునేందుకు వడ్డీలకు పరుగులు తీసినప్పుడు అప్పులపాలు అయ్యేవారు. అలాంటి పరిస్థితి రాకూడదని నాన్నగారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి పేదవాడికి తోడుగా ఉండేవారు. ఆ నాడు 108 నంబర్‌కు ఫోన్‌ కొడితే కుయ్‌..కుయ్‌ అంటూ 20 నిమిషాల్లో అంబులెన్స్‌ ఇంటికి వచ్చేది. ఇవాళ విశాఖ కేజీహెచ్, విజయవాడ ఆసుపత్రి చూసినా ఒకే మంచంపై ఇద్దరిని పడుకోబెడుతున్నారు. ఒకే బెడ్‌పై ఇద్దరు పడుకోలేక ఇటీవల విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కిందపడి చనిపోయింది. ఇంతటి దారుణం ఈ పాలనలో చూస్తున్నాం.
– ఉత్తరాంధ్ర జిల్లాలో జ్వరాలు వచ్చి 200 మంది ఆసుపత్రిలోనే కన్నుమూశారు.  ఇంతటి దారుణమైన పరిస్థితిలో ఆసుపత్రి ఉన్నప్పుడు..చంద్రబాబు తన క్యాబినెట్‌లోని మంత్రి యనమల రామకృష్ణుడి పంటి నొప్పికి సింగపూర్‌కు పంపించారు. అదే పేదవాడు హైదరాబాద్‌లో ఆపరేషన్‌ చేయించుకోవాలంటే ఆరోగ్యశ్రీ కట్‌ అంటున్నారు. ఇటువంటి అన్యాయమైన, మోసపూరితమైన పాలన ఎప్పుడెప్పుడు పోవాలని ప్రజలంతా కోరుతున్నారు.
– పొరపాటున కూడా చంద్రబాబును క్షమిస్తే..ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడదు. ఈ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం ఉండదు. ఎవరైనా నాయకుడు ఫలానిది చేస్తానని ప్రకటించి చేయకపోతే ఆయన తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. ఇది జరగాలంటే ఒక్క జగన్‌ వల్లే సాధ్యం కాదు..జగన్‌కు మీ అందరి తోడు, దీవెనలు కావాలి. మీ బిడ్డ ఎక్కడ పండుకుంటున్నారో తెలుసు. మీరు ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే నేను ఎక్కడ ఉంటానో మీ అందరికి తెలుసు. ఈ చెడిపోయిన వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరిని మీ బిడ్డకు తోడుగా ఉండాలని పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.

Related Post

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


www.000webhost.com