వంచన చేయడమే చంద్రబాబు లక్ష్యం

వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి

– కరువును ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
– గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరంలో కరువు లేదా?
– రైన్‌ గన్ల పేరుతో భారీ దోపిడీ
హైదరాబాద్‌: ప్రజలను ఎలా వంచన చేయడమే చంద్రబాబు లక్ష్యమని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి విమర్శించారు. దేశానికి అన్నం పెట్టే రైతు ఇవాళ ప్రకృతి వైఫరీత్యాల కారణంగా దుర్భిక్ష్య పరిస్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కరువును ఈ ప్రభుత్వం పట్టించుకోడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంవీఎస్‌ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు.  ఇవాళ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని 336 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో కేవలం 275 మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. టీడీపీ నాయకులు కూడా కరువు మండలాల ప్రకటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈనాడు పేపర్లో ఎండిపోయిన పొలాలు, కరువు మండలాల గురించి కథనాలు రాసినా చంద్రబాబు కనిపించడం లేదన్నారు.
జనాలను ఎలా వంచన చేయాలన్నదే చంద్రబాబు ప్రధాన ధ్యేయమని మండిపడ్డారు. వ్యవసాయ రంగానికి ఇచ్చిన హామీలలో చంద్రబాబు వంచించారని ధ్వజమెత్తారు. చివరకు కరువు మండలాల ప్రకటనలో కూడా వంచనేనా అని చంద్రబాబును నిలదీశారు. కరువు మండలాల విషయంలో కేంద్రానికి వాస్తవ విషయాలు కూడా చెప్పకుండా చంద్రబాబు దాచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం కూడా ఇక్కడి కరువు చూసి కళ్లనీళ్లు పెట్టుకుందని చెప్పారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం 42.75 లక్షల హెక్టార్లలో ఉండగా ఇప్పటి వరకు 21.34 లక్షల హెక్టార్లు మాత్రమే అన్నారు. నూనె గింజలు అయితే 10.35 లక్షల హెక్టార్లకు గాను 4.54 లక్షల హెక్టార్లలోనే సాగు చేశారన్నారు. పప్పుధాన్యాలు 4.54 లక్షల హెక్టార్లకు గాను కేవలం 1.54 లక్షల హెక్టార్లలోనే ఇంతవరకు సాగు చేశారని వివరించారు. జులై 20వ తేదీ నాటికి పప్పుధాన్యాలు, ఖరీఫ్‌ సాగుకు కట్‌ ఆఫ్‌ డేట్‌ అయిపోతుందని, ఆ తరువాత సాగు చేస్తే రైతులు మరింత నష్టపోతారని పేర్కొన్నారు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రత్యామ్నయ పంటలు వేసుకోండి అని ఉచిత సలహా ఇచ్చి వ్యవసాయ శాఖ చేతులు దులుపుకుందని ఫైర్‌ అయ్యారు. ప్రభుత్వ రిపోర్టుల ప్రకారమే రాష్ట్రంలో వ్యవసాయం అత్యంత దుర్భర పరిస్థితిలో ఉందని చెప్పినా..ఈ నాయకులు కళ్లు తెరవకపోవడం బాధాకరమన్నారు.
రైన్‌ గన్లతో ఖరీఫ్‌ను పారద్రోలుతామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇవాళ 275 మండలాలను కరువు మండలాలుగా ఎలా ప్రకటించారని ప్రశ్నించారు. రైన్‌ గన్‌ల పేరుతో కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన చరిత్ర టీడీపీ నేతలదని విమర్శించారు. గుంటూరు జిల్లాలో 23 కరువు మండలాలు ఉన్నాయని, శ్రీకాకుళంలో 10, విజయనగరంలో 13 కరువు మండలాలు ఉంటే ఒక్కటి కూడా ప్రకటించలేదన్నారు. పట్టిసీమతో సీమకు నీళ్లు ఇస్తామంటే వైయస్‌ జగన్‌ అడ్డు పడుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

Related Post

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


www.000webhost.com