రైతులకు తిప్పలు..నీకు గొప్పలా?

ప్రకృతి సేద్యంలో ఏదీ పురోగతి..
రైతు వ్యతిరేకికి అంతర్జాతీయ గౌరవమా..
–ధరల స్థిరీకరణ నిధి ఉసేదీ చంద్రబాబూ..!
–వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవిఎస్‌ నాగిరెడ్డి
అమ‌రావ‌తి:  రాష్ట్రంలో వ్యవసాయం తిరోగమనంలో పయనిస్తున్నా.. ప్రకృతి సేద్యంలో పురోగతి సాధిస్తున్నట్లు అంతర్జాతీయ స్థాయిలో  చంద్రబాబు గొప్పలు చెప్పకోవడం విడ్డూరంగా ఉందని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవిఎస్‌ నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకృతి సేద్యంలో రాష్ట్రంలో ఏకంగా 60 లక్షల ఎకరాల్లో వ్యవసాయం చేసేలా ప్రణాళికల్ని అమలు చేస్తున్నారంటూ ఐక్యరాజ్య సమితినే పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. వ్యవసాయాన్ని అన్ని రకాలుగా నాశనం చేసి రైతులను మోసం చేసి అప్పులపాలు చేసిన  చంద్రబాబును వచ్చేనెల 24న న్యూయర్క్‌ కార్యాలయంలో ప్రసంగించాలని ఐక్య రాజసమితి కోరడం హస్యస్పదమన్నారు. గడిచిన నాలుగున్నర  సంవత్సరాల్లో రైతులకు చంద్రబాబు చేయని ద్రోహం అంటూ ఉందా అని ప్రశ్నించారు. రైతు వ్యతిరేకిగా ముద్రపడిన చంద్రబాబుకు వ్యవసాయంలో అంతర్జాతీయ గౌరవాలను అందుకునేందుకు కనీస  అర్హత లేదన్నారు. రైతురుణాలన్నీ మాఫీ చేస్తానని, రుణాలు కట్టవద్దని, తాకట్టు పెట్టుకున్న పుస్తెల తాడులు, దస్తావేజులు ఇంటికి తెస్తానని చంద్రబాబు నమ్మించి వంచించారన్నారు. బ్యాంకులు రైతుల బంగారం వేలం వేస్తుంటే, రుణమాఫీ జరగక బ్యాంకులు వేలం నోటీసులు పంపిస్తుంటే రైతులు ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్యలకు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. పగలు నిరాంతరాయంగా తొమ్మిది గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తానని చెప్పిన చంద్రబాబు నేడు ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ మా దగ్గర మిగులు విద్యుత్‌ ఉంది. రాయితీలిస్తాం రమ్మని చెబుతూ నేటికి 9గంటలు విద్యుత్‌ ఇవ్వMýంండా రైతులను మోసం చేస్తున్నారన్నారు. ఐదువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని చెప్పి గిట్టుబాటు కాని కనీస మద్దతు ధరల కంటే తక్కువకు కుప్పకూలిపోయిన ధరలకు రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకుంటున్నా ధరల స్థిరీకరణ నిధి ఉసెత్తకుండా వంచన చేశారన్నారు. దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జలయజ్ఞంలోని 38 ప్రాజెక్టులను 2018–19 నాటికి 19,372 కోట్ల రూపాయలతో పూర్తి చేస్తానని ప్రణాళికను ప్రకటించి రూ.56 వేల కోట్ల రూపాయాలను దోచుకుని నేటికి ఒక ప్రాజెక్టు కూడా పూర్తి చేయ్యకుండా సాగునీటి ప్రాజెక్టులను అవినీతి పారుదల ప్రాజెక్టులుగా చంద్రబాబు మార్చారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా, లక్షలాది రైతు కుటుంబాలు పక్క రాష్ట్రాలకు వలసపోతున్నా వ్యవసాయం ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పరుగులు పెడుతుందని మభ్య పెడుతున్నారన్నారు. చ్రరితలోనే ఎన్నడూ లేనంత తక్కువస్థాయిలో కనీస మద్దతు« ధరలు  పెరుగుతున్నా కనీసం ప్రధానికి ఒక ఉత్తరం ముక్క కూడా రాయలేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతు సంతోషంగా ఉండటమే ముఖ్యమంత్రికి రివార్డుగా వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి భావిస్తే, రాష్ట్రంలో కరువు, వరదలతో రైతాంగం సతమతం అవుతుంటే విదేశాల్లో తనకు అరుదైన గౌరవం దక్కిందని ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబుని రైతులు క్షమించరన్నారు.

Related Post

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


www.000webhost.com