– వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
– ముస్లింలకు వైయస్ఆర్సీపీ అండ
– ముస్లింల ఓట్లు అడిగే హక్కు చంద్రబాబుకు లేదు
– టీడీపీ పతనంతోనే ముస్లింలకు మేలు
గుంటూరు: రాష్ట్రంలో ముస్లిం సోదరులు అధైర్యపడవద్దని, అందరికీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు భరోసా ఇచ్చారు.‘నారా హమారా.. టీడీపీ హమారా’ సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన అమాయక ముస్లిం యువకులపై అక్రమ అరెస్టులకు పాల్పడడం అమానుషమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సభలో అరెస్టు అయిన ముస్లిం యువకులు శుక్రవారం బెయిల్‌పై విడుదల అయ్యారు. వారికి వైయస్ఆర్సీపీ నాయకులు అండగా నిలబడ్డారు. అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడైనా ముస్లింలు లేని కేబినెట్ చూశామా అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు. ముస్లింలను కేబినెట్లోకి తీసుకోరు కాని, అయన కోడుకు లోకేష్‌ను మాత్రం తీసుకుంటారని దుయ్యబట్టారు. ముస్లింల అభివృద్ది గురించి చంద్రబాబు ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ ఘటనతో ముస్లింల ఓట్లు అడిగే పూర్తి హక్కు చంద్రబాబుకు పోయిందని, ఆయన హయాంలో ముస్లింలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. డిమాండ్లను ప్రశ్నిస్తే చర్చించడం మర్చిపోయి అనగదొక్కే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. టీడీపీ పతనంతోనే ముస్లింలకు మేలు జరుగుతుందని అంబటి అభిప్రాయపడ్డారు.
Be the first to comment