తూర్పు గోదావరి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో శనివారం మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అశేష జనవాహిని వెంట నడువగా తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర 2700 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వైయస్ జగన్ గుర్తుగా అక్కడ ఒక మొక్కను నాటారు.2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా ఆయన జూన్ 12న తూర్పుగోదావరి జిల్లాలో అడుపెట్టారు. కాగా, ఇవాళ వైయస్ జగన్ పాదయాత్ర 234వ రోజు 103వ నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. సాయంత్రం తుని పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు.
ప్రజా సంకల్ప యాత్ర @2700 కిలోమీటర్లు

Be the first to comment