-కలిమిలి ఆధ్వర్యంలో…..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు
– వై.సి.పి. లోకి చేరిన 80 మంది టిడిపి,కాంగ్రెస్ కార్యకర్తలు
– 2019లో జగన్ ను ముఖ్యమంత్రి చేయడమే మన లక్ష్యం
నెల్లూరుజిల్లా : వెంకటగిరి నియోజకవర్గం, వెంకటగిరి రూరల్ మండలం, గుండ్లసముద్రం అరుంధతీ వాడలోని… సుమారు 80 మంది టిడిపి కాంగ్రెస్ పార్టీలకు సంభందించిన కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.
కార్యక్రమంలో భాగంగా… కలిమిలి… వైసిపి కండువా కప్పి, క్రొత్తవారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా… కలిమిలి రాంప్రసాద్ మాట్లాడుతూ… 2019లో జగన్ ను ముఖ్యమంత్రి చేయడమే మన లక్ష్యమని, కావున ప్రతిఒక్కరూ పార్టీకోసం వచ్చే ఎన్నికల్లో కష్టపడాలని పిలుపునిచ్చారు.
Be the first to comment